కోల్‌బెల్ట్, వెలుగు: యువతకు క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కాసీపేట మండలాల్లో ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూరు మండలం శివలింగాపూర్గ్రామంలో సత్వ ప్రకృతి వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం కాసీపేట మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్టోర్నమెంటు విజేతలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి ఫ్రైజులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. క్రీడల ద్వారా క్రమశిక్షణ,సెల్ప్డిఫెన్స్, టీం స్పిరిట్ పెరుగుతాయన్నారు. కాసీపేట మండలప్రీమియం లీగ్ మినీ సీజన్-1 క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు రూ.40 వేలు క్యాష్, ట్రోఫీ,రన్నర్‌గా నిలిచిన పల్లంగూడ టైటాన్స్‌కు రూ.30వేల క్యాష్, ట్రోపీని ఎంపీ, ఎమ్మెల్యే అందజేశారు. చెన్నూరు పట్టణంలోని మధునపోచమ్మ తల్లి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూజలు చేశారు. అమ్మవారిని దర్మించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త నరేశ్ సొదరి దీప్తి-శేఖర్ వివాహ వేడుకలకు ఎంపీ హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం చెన్నూరు మండలం దుగ్నేపల్లి గ్రామంలో కాంగ్రెస్ లీడర్, మాజీ ఎంపీటీసీ చెలిమల బాపురెడ్డి, తండ్రి రాజిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
