పర్యావరణహిత హైదరాబాదే లక్ష్యం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

పర్యావరణహిత హైదరాబాదే లక్ష్యం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా కృషి చేస్తున్నదని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఇండ్ ఫేమ్ విజువల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సామాజిక, పర్యావరణ అంశాల ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంత‌రం వార్షికోత్సవ వేడుక‌ల్లో ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణల తొలగింపు కష్టమైనప్పటికీ ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హైడ్రా వార్షికోత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉందని  సినీ ద‌ర్శకుడు త‌రుణ్ భాస్కర్ తెలిపారు.