సన్నవడ్లపై హామీ ఉత్తదే.. 20 రోజులైనా సప్పుడు లేదు

సన్నవడ్లపై హామీ ఉత్తదే.. 20 రోజులైనా సప్పుడు లేదు
  •     టోకెన్ల కోసం రైతుల తిప్పలు.. మిల్లుల ముందు ఎదురుచూపులు
  •     తక్కువ రేటు చెబుతున్న మిల్లర్లు.. తప్పక అమ్ముకుంటున్న రైతులు
  •     రూ. 1,888 పలుకుతున్న దొడ్డు వడ్లు.. సన్న వడ్లకు రూ. 1,650
  •      మిల్లర్లను బతికిస్తున్నరు, తమను నట్టేట ముంచుతున్నారంటున్న రైతులు

నల్గొండ, వెలుగుసన్న వడ్లపై సీఎం కేసీఆర్‌హామీ ఉత్తముచ్చటనే అవుతోంది. ధర పెంచి కొంటామని సీఎం చెప్పి ఇరవై రోజులైతున్నా ఇప్పటికీ ఎక్కడా కదలిక కనిపిస్తలేదు. మిల్లుల ముందు పడిగాపులు కాయలేక, రోజుల తరబడి ఎదురు చూడలేక రైతులు అవస్థలు పడుతున్నరు. ఎన్ని రోజులు ఆగాలో అర్థం కాక దొడ్డు వడ్ల కన్నా తక్కువకే, మిల్లర్లు చెప్పిన రేటుకే అమ్ముకొని పోతున్నరు. మిల్లర్లను బతికిస్తున్నరు, తమను నట్టేట ముంచుతున్నరని రైతులు ఆవేదన చెందుతున్నరు. దీనికి రైతులకు రూ. 4650 నుంచి 1780 మాత్రమే అందింది. సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న సీఎం కేసీఆర్.. మద్దతు ధర కూడా ఇప్పించలేకపోతున్నా రని రైతులు మండిపడుతున్నా రు.

దొడ్డు వడ్లకు గిట్టుబాటవుతోంది

వడ్లకు సర్కారు ప్రకటించిన కనీస మద్దతు ధర(‘ఏ’ గ్రేడ్ ధాన్యా నికి) రూ. 1,888లు దొడ్డు వడ్లకుగిట్టు బాటు అవుతోంది. అకాల వర్షాల వల్ల రంగు
మారిన ధాన్యం వస్తదని మొదట్లో మిల్లర్లు దొడ్డురకానికీ కొర్రీలు పెట్టారు. కానీ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో సర్కారు ప్రకటించిన మద్దతు ధరే ఇస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఈ నెల 17 వరకు ఐకేపీ సెంటర్లు 4,34,128 క్వింటాళ్ల వడ్లు కొన్నాయి . పీఏ సీఎస్ సెంటర్లు 3,72,111 క్వింటాళ్లు కొన్నాయి . 13 వేల మంది రైతులకు నుంచి క్వింటాకు రూ.1,888 చొప్పున చెల్లించి ఈ ధాన్యం కొన్నారు.
మిల్లర్లే బాగు పడ్తున్నరు సన్నబియ్యానికి మార్కెట్లో మంచి డిమాం డ్ పలుకుతోంది. ప్రస్తుతం కేజీ బియ్యాన్ని రూ.37 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నా రు. ఈ డిమాండ్‌‌‌‌ దృష్ట్యా కేసీఆర్ సన్నాల సాగును ప్రోత్సహించారు. కానీ రైతులకు మద్ధతు ధర ఇవ్వకుండా మిల్లుర్లకు
మేలు జరిగేలా సన్నాల సాగును ప్రోత్సహించినట్లు కనిపిస్తోంది.

తక్కువ ధరకు సన్నాలను కొంటున్నమిల్లర్లు..

బియ్యం అమ్మకానికి వచ్చేసరికి ధరను అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దొడ్డురకం వడ్లలోనూ సీఎమ్మార్ కింద మిల్లర్లకు చెల్లించే
ధర లాభసాటిగానే ఉంటోంది. ఎలా చూసినా మిల్లర్లకే తప్ప పంట పండించిన రైతులకు గిట్టు బాటు కావట్లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి .

చేతులెత్తేసిన సర్కారు..

దొడ్డు వడ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లను సర్కారు ఏర్పాటు చేసింది. దీంతో రైతులు పంటను నేరుగా సెంటర్లకే తీసుకొస్తున్నారు. షరతుల సాగులో భాగంగా వానాకాలంలో దొడ్డురకం సాగు విస్తీర్ణం సగానికి పడిపోవడంతో కొనుగోళ్లపై దాని ప్రభావం అంతగా లేదు. అకాల వర్షాలకు తెగుళ్లు సోకి తక్కువ పంటే మార్కెట్‌కు రావడంతో మద్దతు ధరకు పెద్దగా సమస్య రాలేదు. కానీ సన్నవడ్లు పండించిన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వడ్లు అమ్మేందుకు టోకెన్ల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టోకెన్లతో మిల్లుల దగ్గరకు వెళ్లాక మిల్లర్లు చెప్పిన రేటుకే అమ్ముకొని పోతున్నరు. నల్గొండ జిల్లాలో ఈ నెల 16 వరకు 4.35లక్షల క్వింటా ళ్ల సన్నవడ్లు కొన్నారు.

మద్ధతు ధర ఇవ్వట్లేదు

పదెకరాల్లో పూజ రకం సన్న వడ్లు కౌలుకు సాగు చేసిన. రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టిన. 180 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టోకెన్ తీసుకుని వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద ఉన్న మిల్లుకు పోయిన. వడ్లు బాగాలేవని క్వింటాకు రూ.1,750 ఇచ్చిండ్రు.

– సైదులు, లక్ష్మీపురం, మిర్యాలగూడెం మండలం