యాదగిరిగుట్టను అపవిత్రం చేసిన్రు: ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య

యాదగిరిగుట్టను అపవిత్రం చేసిన్రు: ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య
  • యాదగిరిగుట్టను అపవిత్రం చేసిన్రు
  •     ఆలయ ప్రాంగణాన్ని నీటితో కడిగిన ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు రాజకీయాలు మాట్లాడి ఆలయాన్ని అపవిత్రం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. గురువారం కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అనంతరం కొండ కింద వైకుంఠద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేసినా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లకు బుద్ధి రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే అది చూసి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఓర్చుకోవడం లేదన్నారు. 

అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుద్ధి చెప్పినా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అహంకారం మాత్రం తగ్గడం లేదన్నారు. దేవుడి పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం వార్డు సభ్యులను కూడా గెలుచుకోలేరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, నాయకులు దుంబాల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ, తుర్కపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.