నెల రోజుల్లో 25 లక్షల పెళ్లిళ్లు

నెల రోజుల్లో 25 లక్షల పెళ్లిళ్లు
  • 3 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని సెయిట్‌‌​ అంచనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశంలో బాగా తగ్గిన పెళ్లిళ్ల సంఖ్య రాబోయే నెల రోజుల్లో ఒక్కసారిగా పెరగనుంది. నవంబర్​ 14 నుంచి డిసెంబర్​ 13 మధ్యలో మన దేశంలో ఏకంగా 25 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పెళ్లిళ్ల వల్ల రూ. 3 లక్షల కోట్ల మేర బిజినెస్​ జరుగుతుందని కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఆల్​ ఇండియా ట్రేడర్స్​ (సెయిట్​) అంచనా వేస్తోంది. ఒక్క ఢిల్లీలోనే 1.5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, రూ. 50 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని సెయిట్​ చెబుతోంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఆంక్షల వల్ల  పెళ్లిళ్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఫలితంగా సంబంధిత ఖర్చులూ తగ్గిపోయాయని సెయిట్​ పేర్కొంటోంది. బాంకెట్​ హాల్స్​, హోటళ్లు, ఓపెన్​ లాన్స్​, ఫార్మ్​ హౌస్​లు అన్నీ.. పెళ్లిళ్ల సీజన్​కు రెడీగా ఉన్నాయని సెయిట్​ తెలిపింది. పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చు రకరకాలుగా ఉంటుందని, దాని ఎఫెక్ట్​ చాలా సర్వీసులపై పడుతుందని వివరించింది. చాలా రాష్ట్రాలలో పెళ్లిళ్లకు 250 మంది దాకా అనుమతిస్తున్నారు. ఢిల్లీలో 200 మందికి పర్మిషన్​ ఉంది. కానీ, ఎన్​సీఆర్​లోని కొన్ని చోట్ల ఇందులో 50 శాతాన్నే అనుమతిస్తున్నారు. ముంబైలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. పెళ్లిళ్ల జోరుతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మళ్లీ కళకళలాడుతుందని భావిస్తున్నారు.

15 నుంచి టార్సన్స్ ఐపీఓ

హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్ కంపెనీ టార్సన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్  ఐపీఓకు రెడీ అయింది. దీని పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15–17 తేదీల్లో ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ.1,024 కోట్లు సేకరిస్తామని కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం  ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.150 కోట్ల విలువైన షేర్లను, ఓఎఫ్ఎస్ ద్వారా1.32 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతారు. పరిశోధనా సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూట్లు, ఫార్మా కంపెనీలు, కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లు, డయాగ్నస్టిక్ కంపెనీలు, హాస్పిటళ్ల ల్యాబ్‌‌లలో ట్రాసన్ ప్రొడక్టులను వాడతారు. కంపెనీకి ప్రస్తుతం, కంపెనీ పశ్చిమ బెంగాల్‌‌లో సుమారు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐదు మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలు ఉన్నాయి. దాదాపు 40 దేశాలకు తన ప్రొడక్టులను అమ్ముతుంది.

టార్సన్స్ ఐపీఓ వివరాలు

ఐపీఓ ప్రారంభ తేదీ: నవంబర్ 15, 2021
ఐపీఓ ముగింపు తేదీ: నవంబర్ 17, 2021
షేర్‌‌ ఫేస్‌‌ వాల్యూ: రూ.2
ప్రైస్‌‌ బ్యాండ్: రూ.635–రూ.662
మార్కెట్ లాట్: 22 షేర్లు
ఇష్యూ సైజు: రూ.1,023.47 కోట్లు