56 దవాఖాన్లపై వరద ప్రభావం..అధికారుల అలసత్వం

56 దవాఖాన్లపై వరద ప్రభావం..అధికారుల అలసత్వం

హైదరాబాద్, వెలుగు: వరద నీటిలో మునిగిన దవాఖాన్లను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఆరోగ్యశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్నారు. మంథనిలో మునిగిన 50 బెడ్ల మదర్ అండ్ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటివరకు కనీసం క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చేయించలేదు. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైన ఈ దవాఖాన.. వరదల కారణంగా జులైలో మూతబడింది. రూ.7 కోట్లతో దీన్ని నిర్మించారు. మళ్లీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక మంచిర్యాల జిల్లాలో గోదావరి ఒడ్డున నిర్మించిన 200 బెడ్ల ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరదలో మునిగి అందులోని వస్తువులన్నీ పాడైపోయాయి. ఇక్కడ రిపేర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రూ.19 కోట్లతో నిర్మించిన ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతబడడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డెలివరీలు చేస్తున్నారు. దీంతో గవర్నమెంట్​ హాస్పిటల్​లో పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోడ్ పెరిగి ఇబ్బంది అవుతోందని సిబ్బంది అంటున్నారు.  

ఒక్క స్టోర్ రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే రూ.35 లక్షలు అవసరం

పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, సబ్ సెంటర్లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 56 దవాఖాన్లు వరదల వల్ల దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలో డిస్ట్రిక్ట్  స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వరద రావడంతో అందులో ఉన్న మందులన్నీ పాడైపోయాయి. ఈ స్టోర్ రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే రూ. 35 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా ములుగు జిల్లాలో 5 పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, 2 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 2 సబ్ సెంటర్లు నీట మునిగాయి. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, 7 సబ్ సెంటర్లు పాడయ్యాయి. ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి 40కి పైగా హాస్పిటళ్లు దెబ్బతిన్నాయి. ఈ మొత్తం దవాఖాన్ల రిపేర్లకే రూ. 2 కోట్ల 47 లక్షలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. రూ.3.3 లక్షల విలువైన మెడిసిన్ నీటిలో తడిసి పోయిందని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు.