ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : రేపు మరోసారి వాదనలు విననున్న హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : రేపు మరోసారి వాదనలు విననున్న హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సిట్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరుపున మహేష్ జెఠ్మలాని వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సిట్ పై నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని మహేష్ జెఠ్మలాని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. కేసుతో సంబంధం లేని వారిని ఎఫ్ఆర్ జాబితాలో చేర్చారని తెలిపారు. 

డివిజన్ బెంచ్ ఆదేశాలు చాలా క్లియర్ గా ఉన్నా సీబీఐతో విచారణ జరిపించాలని కోరడం సమంజసం కాదని సిట్ తరపున వాదించిన దుష్యంత్ దవే చెప్పారు. రియా చక్రవర్తి కేసును సైతం దవే ఈ సందర్భంగా ప్రస్తావించారు. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదన్న వాదనను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, నిందితులతో సంబంధం లేదంటూనే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వాదించారు. నిందితులు మాట్లాడిన కామెంట్స్ ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ లో బయటపడుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేటికి వాయిదా వేసింది. రేపు మరోసారి వాదనలు విననుంది.