బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది.  వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా రూల్స్ ఉల్లంఘించారని  రిమాండ్ రిపోర్టు ఇవ్వడం కరెక్ట్ కాదన్న హైకోర్టు.. బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్ ను కొట్టివేసింది.  సంజయ్ ను రూ.40,000 పర్సనల్ బాండ్ పైన విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని.. అరగంటలో కేసు,అరెస్ట్ , రిమాండ్ చేయడం  ఏంటని పోలీసులను ప్రశ్నించింది.  పోలీసులు పెట్టిన 333 సెక్షన్ అక్రమమని..ఎఫ్​ఐఆర్ లో నుండి ఆ సెక్షన్ తొలగించాలని.. చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపజేయాలని ఆదేశించింది. .బండి సంజయ్ ను రిలీజ్ చేయాలని జైళ్లశాఖ డీజీకి  ఆదేశమిచ్చింది. 

రెండు విషయాలలో పోలీసుల తీరును  తప్పబట్టింది హైకోర్టు. పోలీస్ అధికారి అరెస్టుకు ముందు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది హైకోర్ట్. రాత్రి 10:50 అరెస్టు ఆ తర్వాత రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ఎఫ్ఐఆర్ సరైంది కాదని తెలిపింది బండి సంజయ్ కుడిచేయి వేలికి గాయమైందని చెప్పి ఎఫ్ఐఆర్లో సెక్షన్ 333 అదనంగా చేర్చారని.. కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం ఇంకా మెడికల్ రిపోర్ట్ అందాల్సి ఉందని పోలీసులు చెప్పారని కోర్టు  తెలిపింది.  కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే 17 వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైంది కాదని అభిప్రాయపడింది హైకోర్ట్. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 7 కు వాయిదా వేసింది.

ఉద్యోగ,ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో రద్దు చేయాలని  ఈ నెల 2న కరీంనగర్ లో జాగరణ దీక్షకు దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.   కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరు పర్చగా  బండి సంజయ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

మరిన్ని వార్తల కోసం: 

అనాథల తల్లి సింధుతాయ్ ఇకలేరు

ఉద్యమకారులతో పెట్టుకోవద్దు