హైకోర్టు సీరియస్..ఐదుగురిని రిలీజ్ చేయాలని ఆదేశం

 హైకోర్టు సీరియస్..ఐదుగురిని రిలీజ్ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రోహింగ్యాలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టు సీరియస్​ అయ్యింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. కింది కోర్టు గతంలో బెయిల్‌‌‌‌ ఇచ్చినా రెహముల్లా, జాఫర్‌‌‌‌ ఆలమ్‌‌‌‌ అలియాస్‌‌‌‌ మహమద్‌‌‌‌ సాజిద్, అబ్దుల్‌‌‌‌ అజీజ్, నూర్‌‌‌‌ ఖాసీం అలియాస్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ నూర్, నాజర్‌‌‌‌ ఉల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌లను ప్రభుత్వం చర్లపల్లి జైల్లోనే ఉంచింది.

ఈ చర్యను సవాల్‌‌‌‌ చేస్తూ హైదరాబాద్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌ తాహీర్‌‌‌‌, ఇతరులు హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. ఆ పిటిషన్లను జస్టిస్‌‌‌‌ షమీమ్‌‌‌‌ అక్తర్, జస్టిస్‌‌‌‌ వేణుగోపాల్‌‌‌‌ డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ గురువారం విచారించింది. విదేశీయులను, శరణార్థులను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. విదేశీ పౌరుల చట్టం 3(2) జీ ప్రకారం ఆ అధికారం కేంద్రానికి ఉందని వెల్లడించింది.