కలెక్టర్ రిపోర్ట్ చెల్లదు.. దొడ్డిదారిన విచారణ ఏంటి?.. హైకోర్టు ఆర్డర్

కలెక్టర్ రిపోర్ట్ చెల్లదు.. దొడ్డిదారిన విచారణ ఏంటి?.. హైకోర్టు ఆర్డర్

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూములపై మే ఒకటి, రెండున జరిగిన విచారణ లెక్కలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్ట్.  సరైన పద్దతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని సూచించింది. దొడ్డిదారిలో కాకుండా.. రాచమార్గంలో వెళ్లాలని సర్కారుకు హితవు పలికింది హైకోర్ట్. నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారని ప్రశ్నించింది. అధికారులు ఉల్లంఘనకు పాల్పడినట్లు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం హైకోర్టును 4 వారాల గడువు కోరింది.