పోక్సో చట్టం కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

పోక్సో చట్టం కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసు కాబట్టి దర్యాప్తును ఆపలేమన్న కోర్టు

హైదరాబాద్, వెలుగు : పోక్సో యాక్ట్‌‌ కింద తనపై నమోదైన కేసును కొట్టే యాలని ఓ ప్రభుత్వ టీచర్‌‌‌‌ దాఖలు చేసిన రిట్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు తోసిపు చ్చింది. ఈ చట్టం కింద మేజిస్ట్రేట్‌‌ దర్యా ప్తునకు ఆదేశించలేదు కాబట్టి తనపై పోలీసు ఎంక్వైరీని రద్దు చేస్తూ ఉత్తర్వు లివ్వాలని కోర్టులో టీచర్‌‌‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశాడు. పోక్సో చట్టంలోని సెక్షన్‌‌ 11 కింద (ఒక వ్యక్తి లైంగిక వేధింపుల ఉద్దేశంతో పిల్లలకు సైగలు, మాటలు, శబ్దాలు వంటివి చేయడం) నేరమని, సుప్రీం ఉత్తర్వుల ప్రకారం ఇవి నాన్‌‌ బెయిలబుల్, కాగ్నజబుల్‌‌ కేసులని కోర్టు చెప్పింది.

ఐపీసీ చట్టం ప్రకారం మూడేండ్ల దాకా శిక్ష పడే కేసులు కాగ్న జబుల్, బెయిల్‌‌బుల్‌‌ కేసులు అని, కాబ ట్టి తనపై పోలీసులు నమోదు చేసిన పోక్సో యాక్ట్‌‌ కేసును రద్దు చేయాలని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ లోని విద్యానగర్‌‌కు చెందిన గవర్నమెం ట్‌‌ టీచర్‌‌ భాస్కర్‌‌ దాఖలు చేసిన రిట్‌‌ను జస్టిస్‌‌ కె.సురేందర్‌‌ ఇటీవల కొట్టేస్తూ తీర్పు చెప్పారు. ఐపీసీ ప్రకారం నమోదై న కేసుల్లో మూడేండ్ల దాకా శిక్ష లేదా జరిమానా విధించేందుకు వీలుందని కో ర్టు పేర్కొంది. నాన్‌‌బెయిబుల్‌‌ కేసని, చార్జిషీట్‌‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌‌ వినతిని ఆమోదించలేమని తెలిపింది.