కలెక్టర్ కారులో కూర్చొని రిపోర్ట్ రాసిచ్చారా? ఈటల కేసులో హైకోర్టు ఆగ్రహం

కలెక్టర్ కారులో కూర్చొని రిపోర్ట్ రాసిచ్చారా? ఈటల కేసులో హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: ఈటల భూయుల విచారణపై హైకోర్టు మండిపడింది. కారులో కూర్చుని కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుందని హైకోర్టు సీరియస్ కామెంట్ చేసింది. ఈటల భూముల ఎంక్వైరీపై జమునా హ్యాచరీస్ వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాత్రికి రాత్రే కలెక్టర్ చర్యలు ఎలా తీసుకుందని ప్రశ్నించింది హైకోర్టు. విచారణకి ముందు చట్ట ప్రకారం ఫాలో కావాల్సిన రూల్స్ అధికారులు ఎందుకు ఫాలో కాలేదని ప్రశ్నించింది. 18 ఎకరాల ల్యాండ్ కి 2 రోజుల సమయం పడుతుందని.. మరి 128 ఎకరాల భూమి ఒక్కరోజులోపే ఎలా సర్వే చేశారని ప్రశ్నించింది. రీసెంట్ గా సుప్రీం ఇచ్చిన జడ్జిమెంట్.. ల్యాండ్ పోజిషన్ లో ఉన్నవాళ్లయిన ట్రెస్ పాస్ చేయడానికి లేదని తెలిపింది. అక్కడ పౌల్ట్రీ షెడ్ ఉందని, వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నాయి.. ఎలా అధికారులు ప్రేమిసెస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారని కలెక్టర్ల తీరుపై మండిపడింది హైకోర్ట్.

ఈటల రాజేందర్ భూవివాదం వ్యవహారం హైకోర్టుకు చేరింది. తప్పుడు రిపోర్టులతో తమ భూముల్ని స్వాధీనం చేస్కోవాలని చూస్తున్నారని... ఈటల భార్య జమున డైరెక్టర్ గా ఉన్న జమున హ్యాచరిస్ సంస్థ..... హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. తమ నిర్మాణ పనుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని నిన్న హౌజ్ మోషన్ దాఖలు చేశారు. జమున హ్యాచరీస్ భూముల అంశంలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలి పిటిషన్ లో కోరారు మరో డైరెక్టర్, ఈటల కుమారుడు నితిన్ రెడ్డి. దీనిపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

తప్పుడు రిపోర్టులతో తమ భూముల్ని స్వాధీనం చేస్కోవాలని చూస్తున్నారని... ఈటల భార్య జమున డైరెక్టర్ గా ఉన్న జమున హ్యాచరిస్ సంస్థ..... హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. తమ నిర్మాణ పనుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని నిన్న హౌజ్ మోషన్ దాఖలు చేశారు. జమున హ్యాచరీస్ భూముల అంశంలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలి పిటిషన్ లో కోరారు మరో డైరెక్టర్, ఈటల కుమారుడు నితిన్ రెడ్డి.