పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్స్​లో ఇన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కోటాపై స్పష్టత ఇవ్వండి: హైకోర్టు 

పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్స్​లో ఇన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కోటాపై స్పష్టత ఇవ్వండి: హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్, వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌ శాఖల ద్వారా రూరల్, ట్రైబల్​ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లకు పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్స్​లో ఇన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కోటా జీవో 155 అమలు చేయడంపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 12వ తేదీన జరిగే విచారణలో చెప్పాలని ఏజీని ఆదేశించింది. అప్పటి దాకా పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లు ముగించొద్దని, గతంలో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ట్రైబల్​ ఏరియాలో రెండేండ్లు, రూరల్‌‌‌‌‌‌‌‌లో మూడేండ్లు, ఇతర ప్రాంతాల్లో ఆరేండ్లు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన వాళ్లకు పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లలో ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌ కోటా అమలుకు జీవో వెలువడిందని, ఇది అమలు కాకపోవడంపై డాక్టర్‌‌‌‌‌‌‌‌ దినేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌ మరో ముగ్గురు రిట్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్‌‌‌‌‌‌‌‌ అభినంద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ షావిలి, జస్టిస్‌‌‌‌‌‌‌‌ నామావరపు రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రావుతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారించింది.

కాళోజీ వర్సిటీ అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు వాదిస్తూ.. 6 ఏండ్లు సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఉన్న వాళ్లకు ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్లు చెప్పారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.సందీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదిస్తూ.. జీవో అమలు గురించి వర్సిటీ చెప్పకుండా 6 ఏండ్లు సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఉన్న వాళ్లకు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఇరువైపు వాదనల విన్న హైకోర్టు.. విచారణను 12కి వాయిదా వేసింది.