హైకోర్టు ఆగ్రహం..అంబులెన్స్ లను ఆపమని ఎవరు చెప్పారు.?

హైకోర్టు ఆగ్రహం..అంబులెన్స్ లను ఆపమని ఎవరు చెప్పారు.?

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది.  కరోనా పరిస్థితులపై అత్యవసర విచారణ చేపట్టింది హైకోర్టు. హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బార్డర్ లో అంబులెన్స్ లను అడ్డుకోవడం దారుణమని చెప్పింది. ఇతర రాష్టాల నుండి  ఆంబులెన్స్ లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని..వారిని అపమని మీకు ఎవ్వరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించింది. పాతబస్తీలో నిభంధనలు పాటించడం లేదని చెప్పింది. ఇవాళ మధ్యాహ్నం 2.గంటల కు ముఖ్యమంత్రి క్యాబినేట్ భేటి ఉందని కోర్టుకు తెలిపారు ఏజీ.లాక్ డౌన్ పై నైట్ కర్ఫ్యూ పొడిగింపు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.