సంగారెడ్డి జిల్లా అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణకు పాల్పడి శిక్షపడితే మొక్కుబడి క్షమాపణలతో అప్పీలు దాఖలు చేస్తే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్న సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ ఎస్. శ్రీను, తహసీల్దార్ యు.ఉమాదేవి తీరును తప్పుబట్టింది. కోర్టు ధిక్కరణ అప్పీలులో హాజరుకావాల్సి ఉండగా ఎందుకు రాలేదని ప్రశ్నించింది. వచ్చే విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
