టీఎస్ ఎంసెట్ కన్వీనర్గా కుమార్

టీఎస్ ఎంసెట్ కన్వీనర్గా కుమార్

రాష్ట్రంలో 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే వ‌ర్సిటీల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి ఖ‌రారు చేసింది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి క‌న్వీన‌ర్ల‌నూ నియ‌మించింది. టీఎస్ ఎంసెట్, టీఎస్ పీజీఈసెట్‌ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను జేఎన్టీయూహెచ్‌కు అప్పగించింది. టీఎస్ ఐసెట్‌ను కాక‌తీయ యూనివ‌ర్సిటీకి, టీఎస్ లాసెట్‌, పీజీఎల్‌సెట్ ఈసెట్ ఉస్మానియా యూనివ‌ర్సిటీ, టీఎస్ ఎడ్‌సెట్ మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ, టీఎస్ పీఈసెట్ శాత‌వాహ‌న‌ యూనివ‌ర్సిటీకి అప్ప‌గించారు.

కన్వీనర్లు వీరే 

టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ డీన్ కుమార్ 

టీఎస్ పీజీ ఈసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ ర‌వీంద్ర రెడ్డి 

టీఎస్ ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ  

టీఎస్ పీఈసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ రాజేశ్ కుమార్

టీఎస్ ఈసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ శ్రీరాం వెంక‌టేశ్

టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ బీ విజ‌య‌ల‌క్ష్మి

టీఎస్ ఐసెట్ క‌న్వీన‌ర్ – ప్రొఫెస‌ర్ వ‌ర‌ల‌క్ష్మి