హిజాబ్​తో రావొద్దంటే..పరీక్ష రాయకుండా పోయిన్రు

హిజాబ్​తో రావొద్దంటే..పరీక్ష రాయకుండా పోయిన్రు

బెంగళూర్: కర్నాటకలో హిజాబ్ గొడవ మరింత ముదురుతోంది. మంగళవారం హిజాబ్ వేస్కొని వచ్చిన స్టూడెంట్లను మేనేజ్ మెంట్లు అనుమతించలేదు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శివమొగ్గ జిల్లా కేంద్రంలో ముస్లిం స్టూడెంట్లు ఎగ్జామ్ ను బహిష్కరించారు. టీచర్లు హిజాబ్ వద్దన్నందుకు నిరసనగా ఇలా చేశారు. ‘‘మేం చిన్నప్పటి నుంచి హిజాబ్ వేస్కొనే పెరిగాం. మేం దాన్ని వదిలేయం. మేం ఎగ్జామ్ రాయం.. ఇంటికి వెళ్తున్నాం” అని స్టూడెంట్లు చెప్పారు. పేరెంట్స్ వచ్చి బడుల దగ్గర ఆందోళనలు చేశారు. పిల్లలను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే హిజాబ్, కండువాలు గానీ స్కూళ్లకు వేస్కొని రావద్దని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని మేనేజ్ మెంట్లు స్పష్టం చేశాయి. ఇందావర గ్రామంలో హిజాబ్ వేస్కున్న ముస్లిం స్టూడెంట్లను స్కూల్ లోకి రానియ్యలేదు. దీంతో స్టూడెంట్ల పేరెంట్స్ వచ్చి ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రిన్సిపాల్ స్కూల్ ను బంజేశారు. చిక్ మగళూరు టౌన్ లో తమ పిల్లలను స్కూల్ లోకి ఎందుకు రానియ్యరని పేరెంట్స్ ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తుమకూరు జిల్లా కేంద్రంలోనూ ఇలాగే జరిగింది. పేరెంట్స్ పెద్ద ఎత్తున వచ్చి, స్కూల్ దగ్గర నిరసన తెలిపారు. హిజాబ్ లు అనుమతించాలని నినాదాలు చేశారు. చివరికి పోలీసులు వచ్చి, వారిని ఇండ్లకు పంపించారు. కాగా, రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తల కోసం

బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు