
ఎంతటి వారికైనా, ఎంతటి పరిస్థితికైనా మార్పు అనేది అనివార్యం . కొన్ని సందర్భాల్లో ఆ మార్పు మంచి చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో చెదిరిపోని చెడును మోసుకొస్తుంది. ప్రస్తుతం ప్రకృతి విషయంలో రెండోదే అతికినట్టు సరిపోతుంది. అంతేకదా.. మారుతున్న వాతావరణం, ప్రకృతిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది కదా ఇప్పుడు. ఈ రెండు ఫొటోలు చూడండి.. కొన్ని సందర్భాల్లో మార్పు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పకనే చెప్తాయి ఈ ఫొటోలు. ఇవి గ్రీన్ ల్యాం డ్ ఫొటోలు. 50 ఏళ్లకు ముందు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో తన గోస చెబుతుంది గ్రీన్ ల్యాం డ్. అప్పట్లో మందంగా పరచుకున్న మంచు, ఇప్పుడు క్రమక్రమంగా పలుచబారిపోతోంది . కరిగిపోయి కొండ తేలుతోంది. నాసా విడుదల చేసిందీ గ్రీన్ ల్యాండ్ శాటిలైట్ ఫొటోలు. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ లో మంచు కరిగి కొండలు తేలాయని, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థ మవుతుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీ లాండ్ గ్లేసియాలజిస్టు క్రిస్టోఫర్ షుమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే చిన్న చిన్న హిమానీనదాలు మాయమవుతున్నాయని, హెల్ హీం, ఫెన్రిస్ , మిడ్ గార్డ్ వంటి పెద్ద పెద్ద గ్లేసియర్లూ ఇప్పుడు ఆ జాబితాలోకి చేరుతున్నా యని అన్నారు. ఇవి కూడా కొన్ని రోజులు పోతే కనుమరుగు కాకతప్పదని హెచ్చరించారు. గ్రీన్ ల్యాండ్ లో అతిపెద్ద గ్లేసి-
యర్ అయిన హెల్ హీం ఇప్పటికే 7.5 కిలోమీటర్ల మేర కరిగిపోయిందని నాసా చెబుతోంది . మిడ్ గార్డ్ లో 16 కిలోమీటర్ల మేర మంచు కరిగిపోయిందని అంటోంది . ఇటీవలే గ్రీన్ ల్యాండ్ లో నాసా ఓషన్ మెల్టింగ్ గ్రీన్ ల్యాం డ్ (ఓఎంజీ) విమానంతో అక్కడి ఉష్ణో గ్రతలను కొలిచింది . అక్కడి ఐస్ టెంపరేచర్లు పెరిగినట్టు గుర్తించింది .