సెలవులు ముందస్తుగా పెట్టినవే.. నా పై రాజకీయ ఒత్తిళ్లు లేవు: కరీంనగర్ సీపీ

సెలవులు ముందస్తుగా పెట్టినవే.. నా పై రాజకీయ ఒత్తిళ్లు లేవు: కరీంనగర్ సీపీ

కరీంనగర్  క్రైం, వెలుగు: కరీంనగర్  సీపీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సెలవు పెట్టలేదని, వెకేషన్ కు కేరళ వెళ్లేందుకు ముందస్తుగా ఈ నెల 1న లీవ్ కు దరఖాస్తు చేసుకున్నారని కమిషనరేట్  ఆఫీస్​ వర్గాలు వెల్లడించాయి. 

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సెలవుపై వెళ్లారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. సీపీ సెలవుల కోసం ఉన్నతాధికారులను సంప్రదించగా, జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు మంజూరైనట్లు తెలిపారు. సడన్ గా లీవ్ లో వెళ్లలేదని, తాజా రాజకీయ పరిణామాలతో సెలవులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.