
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. జడ్చర్లకు చెందిన శృతి (23) హోటల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గతంలో యశోద హాస్పిటల్లో శృతి నర్సుగా పనిచేసినట్లు తెలిసింది. గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్లోని ఓ హోటల్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూంలో బీర్ బాటిల్స్, ఫుడ్ పార్సిల్ ఉన్నాయి. ఈ ఘటనను పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు.