
సినీ, ఫ్యాషన్ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీస్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ ఏడాది మన దేశం నుంచి ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా, జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 24 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
లేటెస్ట్గా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన హోమ్‌బౌండ్ మూవీ కేన్స్లో అదరగొట్టింది. ‘అన్ సర్టైన్ రిగార్డ్’విభాగంలో ప్రదర్శించబడింది. ఈ సంవత్సరం (2025) కేన్స్‌లో ప్రదర్శించబడిన ఏకైక భారతీయ చిత్రం ఇది. ఇందులోని శక్తివంతమైన కథనం దృష్ట్యా కేన్స్లో అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు.
9 minutes of pure love & applause!🤌🏻
— Dharma Productions (@DharmaMovies) May 21, 2025
Team Homebound receiving all the appreciation at @Festival_Cannes! pic.twitter.com/QFlnw13810
ఈ క్రమంలో హోమ్‌బౌండ్ మూవీకి 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్తో పాటు చప్పట్లు కొడుతూ చిత్ర బృందాన్ని ప్రశంసించడంతో ‘హోమ్‌బౌండ్’టీమ్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read : విష్ణు కన్నప్ప కొత్త అప్డేట్.. మోహన్ లాల్ కిరాత క్యారెక్టర్ గ్లింప్స్
ఇకపోతే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలిరోజు నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా సర్‌ప్రైజ్ చేసింది. మల్టీ కలర్ పొడవైన గౌను, జుడిత్ లీబర్ డిజైన్ చేసిన చిలుక ఆకారంలో వజ్రాలు పొదిగిన క్లచ్ బ్యాగ్‌ను ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. అయితే ఊర్వశి లుక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
— Dharma Productions (@DharmaMovies) May 21, 2025
2018లో ఐశ్వర్యరాయ్ కేన్స్‌కు హాజరైన లుక్‌నే ఊర్వశి కాపీ కొట్టిందని, ఆమె వేసుకున్న డ్రెస్, తన హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉన్నాయని, మేకప్ కూడా ఎక్కువైందంటూ ఆమెను రకరకాలుగా ట్రోల్ చేశారు. ఆమె డ్రెస్ కంటే కూడా చేతిలోని ఖరీదైన చిలుక బ్యాగ్ అందరినీ ఆకట్టుకుంది. దీన్నీ ఖరీదు 5సుమారు లక్షలు ఉంటుందని అంచనా. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆలియాభట్ తొలిసారి అడుగుపెట్టాల్సి ఉండగా, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆమె హాజరవడం లేదు.
Wow!#UrvashiRautela carries a crystal parrot clutch at #Cannes2025. 😍#Celebs pic.twitter.com/Mtl5MDOkRp
— Filmfare (@filmfare) May 13, 2025