
కరీంనగర్, వెలుగు: అమృత్ భారత్ స్కీమ్ నిధులతో ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం 9.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో నిర్వహించే ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు.