అర్థంతరంగా నిలిచిన సీయూఈటీ ఎగ్జామ్

అర్థంతరంగా నిలిచిన సీయూఈటీ ఎగ్జామ్

పాలమూరు, వెలుగు: అండర్​ గ్రాడ్యుయేషన్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సెంట్రల్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ (సీయూఈటీ) పరీక్ష మహబూబ్​నగర్​లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో  పరీక్షా  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ ఎగ్జామ్​ ప్రారంభం కాగా..   కాసేపటికే షార్ట్ సర్క్యూట్​తో కరెంటు సరఫరా నిలిచిపోయింది.  దీంతో కంప్యూటర్లు షట్​ డౌన్​ అయ్యాయి.   విద్యాలయం నిర్వాహకులు విషయాన్ని నేషనల్​ టెస్టింగ్​ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లారు. వారు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.