కరెంట్ షాక్తో తల్లి, కూతురు మృతి, తండ్రికి సీరియస్ 

 కరెంట్ షాక్తో తల్లి, కూతురు మృతి, తండ్రికి సీరియస్ 

మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలం బొప్పారంలో గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.  గ్రామ శివారులోని  ట్రాన్స్ ఫార్మర్ దగ్గర కరెంట్ షాక్ తగిలి తల్లి ఏడాది చిన్నారి మృతి చెందారు. భార్యా బిడ్డల్ని కాపాడేందుకు వెళ్లిన భర్త జెల్ల సమ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన వచ్చి గాయపడిన జెల్ల సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం రేపింది.