ఆయిల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లో పడి ఏడుగురు మృతి

ఆయిల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లో పడి ఏడుగురు మృతి

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లో పడి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. కాకినాడ జిల్లాలోని జి.రంగంపేట్‌‌‌‌లో ఉన్న ఆయిల్‌‌‌‌ ఫ్యాక్టరీలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎడిబుల్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ ఉన్న ట్యాంక్‌‌‌‌ను క్లీన్‌‌‌‌ చేసేందుకు ఏడుగురు కార్మికులు అందులోకి దిగారు. ట్యాంక్‌‌‌‌ను శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ కూలీ అందులో జారి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మిగతా ఆరుగురు కార్మికులు ట్యాంక్‌‌‌‌లోకి దిగగా, చిక్కుకుపోయారు. దీంతో ట్యాంక్‌‌‌‌లో ఊపిరాడక మృతిచెందారు. ఇందులో ఐదుగురు కూలీలు పాడేరుకు, మిగతా ఇద్దరు పెద్దపురానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫ్యాక్టరీకి సీలు వేశామని, కేసు నమోదు చేశామని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కృతికా శుక్లా తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించిందని వెల్లడించారు.