గోవా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

గోవా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

గోవాలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి రాజకీయ పార్టీలు. సోమవారం జరిగే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ ఉండటంతో గెలుపు ఏ పార్టీకి అంత ఈజీ గా వచ్చేలా కనిపించడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడుతున్నాయి. గోవా ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 301 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కుమారుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి సంప్రదాయ పనాజీ అసెంబ్లీనుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పనాజీ అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేశారు. 

మరిన్ని వార్తలు

ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్

ఈజీ డ్రైవ్​ నుంచి టూవీలర్​ లోన్లు