
హైదరాబాద్: రేపటి (అక్టోబర్ 2) నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇక దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డ్ అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే పాఠశాలలకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9వరకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది.