కొప్పుల భూదందా : భార్య పేరుతో రూ. కోట్ల విలువైన భూమి కొనుగోలు

కొప్పుల భూదందా : భార్య పేరుతో రూ. కోట్ల విలువైన భూమి కొనుగోలు

ఏసీబీ జప్తులో ఉన్న ల్యాండ్‌‌‌‌‌‌‌‌కు ఎసరు
సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ను మాయం చేసిన రెవెన్యూ ఆఫీసర్లు
జనగామ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ భూమి వ్యవహారం వివాదాస్పదం

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌పై భూ ఆక్రమణల ఆరోపణల తర్వాత రాష్ట్ర సర్కారులో ముఖ్య నేతల అక్రమ దందాలపై చర్చ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ భూముల వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏసీబీ జప్తులో ఉన్న రూ. కోట్ల విలువైన భూమిని మంత్రి తన భార్య పేరిట కొనుగోలు చేశారు. అప్పటివరకు ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న కమర్షియల్ భూమిని ఏకంగా వ్యవసాయ భూమిగా మార్చేసి రెవెన్యూ ఆఫీసర్లు సర్వే నంబర్లతో మాయ చేశారు. రామగుండం మండలం జనగామ శివారులో మంచిర్యాల–గోదావరిఖని రోడ్డుపై కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన గోదావరి ఆక్సిజన్ ప్లాంట్ ల్యాండ్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

తీసుకున్న లోన్ తిరిగి చెల్లించటం లేదని.. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిక్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మూసేసింది. 2009లో ఆస్తిని వేలం వేసింది. అప్పట్లో ఆదిలాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డీఆర్వోగా ఉన్న మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు.. తన కొడుకు గోపీకృష్ణ పేరుతో దీన్ని సొంతం చేసుకున్నాడు. 2011లో మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపై ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఆస్తులను అటాచ్ చేసుకున్న ఏసీబీ ఈ ప్లాంట్ భూమిని జప్తు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో ఇదే భూమిని పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గోపీకృష్ణ విఫలయత్నం చేశారు. ఈ భూమిని ఏసీబీ జప్తు చేసిందని, రిజిస్ట్రేషన్​ చేసేది లేదని పెద్దపల్లి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. 
మంత్రి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డాక్యుమెంట్లు?
మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్ వేసిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ భూమి కథ మరో మలుపు తిరిగింది. 2018లో  మంత్రి భార్య కొప్పుల స్నేహలతతో పాటు మరో ముగ్గురు ఈ భూమిని కొన్నట్లు  డాక్యుమెంట్లు బయటికొచ్చాయి. 854/B సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఎకరాల 14 గుంటల భూమిని రూ. కోటి 60 లక్షలతో గోపీకృష్ణ నుంచి కొన్నట్లు చూపించారు. ఏసీబీ జప్తులో ఉన్న ఈ భూమిని ఎలా రిజిస్ట్రేషన్​ చేశారనేది వివాదాస్పదంగా మారింది.