దారులన్నీ జనజాతరకు.. ముగ్గురు ముఖ్య నేతలు హాజరు

దారులన్నీ జనజాతరకు.. ముగ్గురు ముఖ్య నేతలు హాజరు
  • 30 ఎకరాల స్థలంలో 10 లక్షల మందికి ఏర్పాట్లు
  •  భారీగా తరలివస్తున్న ప్రజలు
  • ముఖ్య అతిథులుగా ఖర్గే, రాహుల్, ప్రియాంక
  • మూడు వేదికలు, అభివాదం కోసం ర్యాంప్
  • ఎంపీ ఎన్నికల జాతీయ మ్యానిఫేస్టో రిలీజ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రారంభం కానుంది. ఈ సభకోసం భారీగా ఏర్పాట్లు చేశారు.  10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేశారు. తుక్కుగూడ సభ నేపథ్యంలో పలు రూట్లలో ట్రాఫిక్ ను మళ్లించింది. సభా వేదిక వద్ద మూడు స్టేజీలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై జాతీయ నేతలు ఆసీనమవుతారు. మరో వేదికపై రాష్ట్ర నాయకులు, మూడో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలకు దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. 

నిన్న ఢిల్లీలో పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్ పేరుతో లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన కాంగ్రెస్ ఈ సభలో తెలుగు మ్యానిఫెస్టోను రిలీజ్ చేయనుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. 30 ఎకరాల  ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన ఈ సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ  ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగే ఈ భారీ బహిరంగం సభవైపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.