కాశ్మీర్ ఫైల్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన గోవా

కాశ్మీర్ ఫైల్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన గోవా

కాశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  భారీ విజయాన్ని దక్కించుకుంది. భారీ వసూళ్లతో పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకెల్తోంది. ' ది కాశ్మీర్ ఫైల్స్ '  సినిమాకి ఆదివారం (మార్చి 13) న భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.దీంతో ఈ సినిమా  స్క్రీన్‌లు  ,  షోలను భారీగా పెంచారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీటీంకు మంచి వార్త చప్పారు.. గోవా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్. కాశ్మీర్ ఫైల్స్ చిత్రం గోవాలో పన్ను రహితంగా ప్రకటించబడుతుందని ఆయన పేర్కొన్నారు. 1990లో జమ్ము కాశ్మీర్‌లో కాశ్మీరీ పండిట్ల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

ఫస్ట్ డే  3.55 కోట్లు  , రెండో రోజు  8.50 కోట్ల  వసూళ్లను సాధించింది. ప్రస్తుతం  ఈ  సినిమాను చూసేందుకు జనాలు భారీగా థియేటర్లకు క్యూ కడుతున్నారు.  మరోవైపు ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి  గుజరాత్, హర్యానా ప్రభుత్వాలు బంఫర్ ఆఫర్ ఇచ్చాయి.  తమ రాష్ట్రాలలో ఈ సినిమాకి  GST పన్నును రద్దు చేస్తున్నట్లు  ప్రకటించాయి