
'ది కేరళ స్టోరీ' మూవీ రిలీజై రెండు వారాలు గడుస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న జనాదరణతో.. సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాదిలో అతి తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్టులో ది కేరళ స్టోరీ రెండవ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ పఠాన్ మొదటి స్థానం లో ఉంది.
ఇక వీకెండ్స్ లో ది కేరళ స్టోరీ దుమ్ముదులుపుతోంది. దీంతో విడుదలైన 11 రోజుల్లోనే టోటల్ నెట్ కలెక్షన్ దాదాపు 150 కోట్లకు పైగా రాబట్టింది. ముంబై సర్క్యూట్‌లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక తొందర్లోనే ఈ మూవీ 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. లాంగ్ రన్ లో ఈ మూవీ ఈజీగా 250 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సంవత్సరంలో రెండవ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ది కేరళ స్టోరీ నిలువనుంది.
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ.. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు తెరలేపింది ఈ సినిమా. దేశంలో కొన్ని చోట్ల ఈ సినిమాపై నిషేధం విధించినా.. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద మాత్రం పడలేదు.