వీసాల జారీలో జాప్యాన్ని తగ్గించేందుకు భారత్ బయట అమెరికా ఎంబసీలు

వీసాల జారీలో జాప్యాన్ని తగ్గించేందుకు భారత్ బయట అమెరికా ఎంబసీలు

వాషింగ్టన్​: పేరుకుపోతున్న  భారతీయుల వీసా దరఖాస్తులను వేగంగా క్లియర్​ చేసేందుకు అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రెసిడెన్షియల్​ కమిషన్​ చేసిన పలు సిఫార్సులను అమలు చేయాలని డిసైడ్​ చేసింది. వీసా దరఖాస్తులు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీసా అపాయింట్మెంట్లను కేటాయించేందుకు  ఇండియా వెలుపల కూడా అమెరికా దౌత్య కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.  ఈ నిర్ణయం వెలువడటంలో ప్రెసిడెన్షియల్​ కమిషన్​ సభ్యుడిగా ఉన్న భారత సంతతి వ్యక్తి అజయ్​ జైన్​ భుటోరియా కీలక పాత్ర పోషించారు. అమెరికాలో చదువుకోవడానికి , టూర్​కు వెళ్లాలని భావించే భారతీయులు వీసాలు దొరకక ఎంతోకాలం ఎదురుచూడాల్సి వస్తోందని ఆయన కమిషన్​ దృష్టికి తీసుకెళ్లడంతో తాజా నిర్ణయం వెలువడింది. 

వీలైన చోట వర్చువల్​ ఇంటర్వ్యూలు

వీలైన చోట వర్చువల్​ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​కు ప్రెసిడెన్షియల్​ కమిషన్​ సిఫారసు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్ల సిబ్బందిలో కొంతమందిని వీసా దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్​లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో విధులకు కేటాయించాలని సూచించింది. ఇలా కేటాయించే సిబ్బంది ద్వారా దరఖాస్తుదారులను వర్చువల్​ ఇంటర్వ్యూలు చేయిస్తే వీసాల జారీ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంటుందని పేర్కొంది.  ఇప్పటికీ ఎంబసీలు ఉన్నచోట కౌంటర్ల సంఖ్యను పెంచాలని కమిషన్​ తెలిపింది. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే భారత్​లోని అమెరికా ఎంబసీ 1 లక్ష దరఖాస్తు లను ప్రాసెసింగ్​ చేసింది. 2019 జులై తర్వాత ఇంత భారీగా వీసా దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి.