‘భారతీయుడు 2’ సినిమాలో యువరాజ్ సింగ్ తండ్రి

‘భారతీయుడు 2’ సినిమాలో యువరాజ్ సింగ్ తండ్రి

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ‘భారతీయుడు 2’ (Indian 2)ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్,  కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ లు నటిస్తున్నారు. మూవీకి సంబంధించిన న్యూ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ క్రికెటర్ ‘యువరాజ్ సింగ్’ తండ్రి ‘యోగ్ రాజ్ సింగ్’ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పంజాబ్ లో ఆయనకు మంచి పేరు ఉంది. తాను ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్నట్లు ఇన్ స్టాగ్రాం వేదికగా వెల్లడించారు.

‘లెజెండ్ కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు 2 సినిమాలో నటించడం కోసం పంజాబ్ సింహం సిద్ధమైంది...నన్ను చాలా అందంగా తీర్చిదిద్దిన మేకప్ ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. మేకప్ వేసుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యోగరాజ్ సింగ్ కూడా క్రికెటర్. భారత జట్టు తరపున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడారు. కుడి చేతివాటం మీడియం పేసర్. గాయం కారణంగా.. క్రికెట్ కు దూరంగా ఉన్నారు. అనంతరం సినిమాల వైపు ఫోకస్ పెట్టారు. పంజాబీ సినిమాలు చేశారు.