విపక్షాల ఆందోళన ..లోక్ సభ వాయిదా

విపక్షాల ఆందోళన ..లోక్ సభ వాయిదా

విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటకు వాయిదా పడింది. లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే ప్రతిపక్ష ఎంపీలు ధరల పెరుగుదలపై భగ్గమన్నారు. జీఎస్టీ, నిత్యావసర ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వెల్లోకి ప్రవేశించి ఆందోళనను మరింత ఉదృతం చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ ఓ బిర్లా విపక్ష సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా..వారు నిరసనలను మానుకోలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ధరల పెరుగుదల, జీఎస్టీపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ద్రవ్యోల్భణం, గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు.  ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.  స్పీకర్ ఓం బిర్లా ముఖానికి అడ్డంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. 

 

 

విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా గౌరవాలు పాటించాలని  విజ్ఞప్తి చేశారు. ప్రతి అంశంపై చర్చకు సిద్దమన్నారు. సభ నిబంధనలకు విరుద్దంగా ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు.