
- ముగ్గురు స్టూడెంట్లకు గాయాలు
- శామీర్‌పేట పీఎస్ పరిధిలో ఘటన
శామీర్‌పేట, వెలుగు: స్కూల్ బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు స్టూడెంట్లకు గాయాలైన ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం అలియాబాద్ నుంచి మజీద్ పూర్ వైపు వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సును కరీంనగర్ నుంచి ఇటుక లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో ముగ్గురు స్టూడెంట్లకు స్వల్ప గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.