పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ములుగు జిల్లా: పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం ములుగు జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని వెంకటాపూర్ మండలం, నల్లగుంట గ్రామానికి చెందిన 21ఏళ్ల యువకుడు, భూపాలపల్లికి చెందిన 17ఏళ్ల యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి కుటుంబసభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు గురువారం నల్లగుంటలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతిని శుక్రవారం ఉదయం లిశాడు.

ఆపై ఇద్దరు కలిసి గ్రామ సమీపంలో పురుగులమందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు. గమనించిన స్థానికులు ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స తర్వాత.. మల్లంపల్లిలోని ప్రైవేటు క్లినిక్‌ కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.