
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ బేబీ.చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం..నేడు సమాజంలో జరిగే సంఘటలకు దగ్గరగా ఉండటంతో యూత్ కు కనెక్ట్ అయింది. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించడం అనే పాయింట్‌తో తెరకెక్కగా.. అలాగే ఒకే సమయంలో ప్రేమించిన వారిని ఎలా మోసిందో కూడా కళ్లకు కట్టినట్టుగా చూపించి సక్సెస్ అయ్యారు.
లేటెస్ట్ గా ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకుగాను తమిళ బేబీ గా లవ్ టుడే ఫేమ్ ఇవానా ను తీసుకోనున్నట్లు టాక్. అలాగే తన సహజ నటనతో ఆకట్టుకునే హీరో శింబు ను బేబీ మూవీ కోసం ఒప్పించారంట డైరెక్టర్. మన్మధ వంటి కల్ట్ మూవీలో తనదైన పెరఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. బేబీ మూవీకి శింబు అయితేనే న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నారట. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.
బేబీ మూవీని రూ 7.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.90 కోట్ల మార్కును దాటేసింది. అసలు ఈ మూవీకి చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ గానీ..పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఇవేమి లేవు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీసి సక్సెస్ అయ్యారు. దీంతో ఇండీస్ట్రీ అంతా ప్రశంసలతో మేకర్స్ ను మెచ్చుకున్నారు. ఇక తమిళ రీమేక్ లోను సాయి రాజేష్ డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గా SKN వ్యవహరిస్తున్నారు.