ముందు టైటిల్ మార్చండి.. రచ్చ చేస్తున్న పవన్ ఫ్యాన్స్

ముందు టైటిల్ మార్చండి.. రచ్చ చేస్తున్న పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ కొత్త సినిమా కి టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. కానీ ఆ టైటిల్ వద్దంటున్నారట ఫ్యాన్స్. పవన్ మూవీ అంటే ఇంకేదో ఉండాలి కదా అనే కామెంట్స్ పెడుతున్నారట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. "బ్రో". పవన్ ప్రస్తుతం తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వినోదయ సీతమ్ కి ఇది రీమేక్. తమిళ సినిమాని డైరెక్ట్ చేసిన సముద్రఖని నే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇద్దరు మెగా హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులోనూ ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నాడు. అందుకే.. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి చిన్న అప్డేట్ వినిపించినా క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్ కోసం చాలా పేర్లనే పరిశీలించారు దేవుడు అని, దేవరా అని, దేవుడే దిగివచ్చినా అని.. ఇలా చాలా టైటిల్స్ ని పరిశీలించారు. కానీ చివరికి "బ్రో" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. కానీ.. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

అయితే.. ఈ టైటిల్ అంతా క్యాచీగా లేదని ఫ్యాన్స్ డిజపాయింట్ అవుతున్నారు. ఈ టైటిల్ వద్దు అంటూ సోషల్ మీడియా వేధికగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూవీ అంటే టైటిల్ ఏ రేంజ్ లో ఉండాలి. మీవల్ల కాకపోతే మాకు చెప్పండి అని సలహాలు కూడా ఇస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోసం ఈ టైటిల్ ని మారుస్తారా? లేక అదే ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి మరి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.