‘థాంక్యూ’ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్

‘థాంక్యూ’ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’  మూవీకి సంబంధించి మరో సాంగ్  ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘అమ్మ నాన్నతో ఓ ఐదేళ్లు... గల్లీ గ్యాంగ్ తో ఓ ఐదేళ్లు.. హైస్కూల్ మేట్స్ తో ఇంకో ఐదేళ్లు’ అంటూ సాగే ఈ ఫేర్ వెల్ సాంగ్ యూట్యూట్ లో దూసుకుపోతోంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ‘థాంక్యూ’  సినిమాను నిర్మిస్తున్నాడు. 

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో హిట్స్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా జూన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ... అది సాధ్యం కాలేదు. కాగా... జూలై 22న  ‘థాంక్యూ’  సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.