సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి  టిమ్స్ కి తరలింపు

 సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి  టిమ్స్ కి తరలింపు
  • తండ్రి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చిన సోమాలియన్

హైదరాబాద్: సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌ను ఎట్టకేలకు ట్రేస్ అవుట్ చేశారు.  పారామౌంట్ కాలనీ బంజారాహిల్స్ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి టెస్ట్ లు చేస్తున్నారు. సోమాలియన్ అబ్దుల్లాహి అహ్మద్ నూర్ ఎక్కడెక్కడ తిరిగింది ఆరా తీసి అతనితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేసింగ్ చేస్తున్నారు. తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్ తప్పిపోవడం కలకలం రేపింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి అతన్ని ట్రేస్ చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, వైద్య అధికారులు ఎట్టకేలకు గుర్తించి అతడు తిరిగిన, కాంటాక్ట్ అయిన ప్రదేశాలపై దృష్టి సారించారు.

తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ వైద్యం కోసం అపోలో, యశోదా ఆస్పత్రులకు వెళ్లినట్లు గుర్తించారు. సిటీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సోమాలియన్ ఫ్యామిలీ వైద్యం నిన్న రెస్టారెంట్ కు కూడా వెళ్లినట్లు తేలడంతో అతడు ఉంటున్న ఇంటితోపాటు మిగిలిన ప్రదేశాల్లో కూడా శానిటైజ్ చేస్తూ టెస్టులు ముమ్మరం చేస్తున్నారు. సోమాలియన్ తండ్రి శ్యాoపిల్స్ తీసుకుని జినోమ్ సీక్వెన్సీ కి పంపారు వైద్యశాఖ అధికారులు.
చికిత్స కోసం తరలించాం: పోలీసు కమిషనర్ అంజనీకుమార్
కరోనా ఓమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిన సోమాలియన్ అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌ ను చికిత్స కోసం గచ్చిబౌలి లోని టీమ్స్ కి చికిత్స కోసం తీసుకువెళ్లారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తప్పిపోయిన సోమాలియన్‌ను పారామౌంట్ కాలనీ బంజారాహిల్స్ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన నిర్ధారించారు. ఈనెల 12వ తేదీన షార్జా నుండి హైదరాబాద్ వచ్చాడని ఆయన వివరించారు.

మరిన్ని వార్తల కోసం: 

రోహిత్తో ఎలాంటి విభేదాల్లేవ్

జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

వీడియో: పల్లకి తెగి కిందపడిన కొత్త జంట