ప్రాణం తీసిన సీతాఫలాల  కొట్లాట

V6 Velugu Posted on Oct 28, 2021

వికారాబాద్, వెలుగు: సీతాఫలాల విషయమై బావ, బావమరది కొట్లాటలో ఒకరి ప్రాణం పోయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం  గడిసింగాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిసింగాపూర్ గ్రామానికి చెందిన బుసి లక్ష్మయ్య, వెంకటయ్య బావ, బావమరదులు. మంగళవారం సీతాఫలం విషయంలో ఇద్దరు గొడవపడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో లక్ష్మయ్య చెల్లెలి భర్త అయిన వెంకటయ్య తలపై కొట్టడంతో అతడికి గాయాలయ్యాయి.  సిటీలో ఉంటున్న వెంకటయ్య కొడుకు నాగేశ్ విషయం తెలుసుకొని గ్రామానికి వచ్చాడు. మేనమామ లక్ష్మయ్యపై కర్రతో దాడి చేశాడు. బుధవారం ఉదయం లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య సైతం చెల్లెలి భర్తపై ఎందుకు దాడి చేశావంటూ  కట్టెతో అతడిని కొట్టాడు. దీంతో  ఈ దెబ్బలు తట్టుకోలేక లక్ష్మయ్య(38) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడేండ్ల కూతురు ఉండగా.. భార్య కొంతకాలం క్రితం అతడిని వదిలి వెళ్లిపోయింది.  గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ​ఫైల్​చేసి దర్యాఫ్తు చేపట్టారు. లక్ష్మయ్యపై దాడి చేసిన వారు పరారీలో ఉన్నారని పరిగి సీఐ లక్ష్మి రెడ్డి తెలిపారు.

Tagged killed, custard apple,

Latest Videos

Subscribe Now

More News