రూ. 82 లక్షల కోట్లు తగ్గిన అమెజాన్ మార్కెట్ క్యాప్‌

రూ. 82 లక్షల కోట్లు తగ్గిన అమెజాన్ మార్కెట్ క్యాప్‌

న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ మార్కెట్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌ గత ఏడాదిన్నరలోనే ఒక ట్రిలయన్ డాలర్లు (రూ.82 లక్షల కోట్లు) తగ్గింది. మార్కెట్‌‌‌‌లో లిస్ట్ అయిన ఒక కంపెనీ మార్కెట్‌‌‌‌ క్యాప్ ట్రిలియన్ డాలర్లు తగ్గడం ఇదే మొదటిసారి. కిందటేడాది జులైలో  అమెజాన్ మార్కెట్‌‌‌‌ క్యాపిటలైజేషన్ 1.88 ట్రిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాప్ 879 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మరో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్  పరిస్థితి కూడా ఇలానే ఉంది. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో రికార్డ్ చేసిన హై నుంచి మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 889 బిలియన్ డాలర్లు తగ్గింది. యూఎస్‌‌‌‌లో ఇన్‌‌‌‌ఫ్లేషన్ గరిష్టాలకు చేరుకోవడం,  ఫెడ్ మానిటరీ పాలసీని  కఠినతరం చేయడంతో  అమెరికన్ టెక్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతున్నాయి. గ్లోబల్‌‌‌‌గా రెసిషన్ ఉంటుందనే భయాలు ఎక్కువవ్వడంతో కూడా టెక్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి నెలకొంటోంది.

మార్కెట్ క్యాప్ పరంగా టాప్  ఐదు కంపెనీలయిన యాపిల్‌‌‌‌, మైక్రోసాఫ్ట్‌‌‌‌, ఆల్ఫాబెట్‌‌‌‌ (గూగుల్‌‌‌‌), అమెజాన్‌‌‌‌, టెస్లా కంపెనీల మార్కెట్ క్యాప్ గత ఏడాది కాలంలో 4 ట్రిలియన్ డాలర్లు తగ్గింది. కరోనా  సంక్షోభం ముగియడంతో కన్జూమర్ల అలవాట్లు తిరిగి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఫలితంగా అమెజాన్‌‌‌‌ రెవెన్యూ తగ్గుతోంది. సేల్స్ తగ్గడం, వడ్డీ రేట్లు పెరగడం వలన  ఖర్చులు  ఎక్కువవ్వడంతో ఈ ఆన్‌‌‌‌లైన్ షాపింగ్ కంపెనీ షేర్లు తమ ఆల్ టైమ్ హై నుంచి 50 శాతం మేర పతనమయ్యాయి.