వ్యాక్సిన్​ వేసుకుంటే మాస్క్​ అక్కర్లే

V6 Velugu Posted on Apr 29, 2021

వాషింగ్టన్​: కరోనా వ్యాక్సిన్​ 2 డోసులు తీసుకున్నోళ్లు మాస్క్​ పెట్టుకోనవసరం లేదని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ ప్రకటించారు. పూర్తి వ్యాక్సిన్​ తీసుకున్నోళ్లు మాస్క్​ పెట్టుకోనక్కర్లేదని ఆ దేశ సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ (సీడీసీ) సిఫార్సు చేయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో సగం మందికిపైగా పెద్దలు కరోనా టీకా తీసుకోవడంతో మాస్క్​ రూల్​ను ఎత్తేశారు. కరోనా వైరస్​పై పోరులో భాగంగా తీసుకున్న చర్యల ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్​ చెప్పారు. ‘‘మీ అందరి సహకారంతో కరోనా కట్టడిలో పురోగతి సాధించాం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతుండడంతో వృద్ధుల్లో కరోనా మరణాలు 80 శాతం తగ్గాయి’’ అని ఆయన అన్నారు. వ్యాక్సిన్​ వేసుకున్నోళ్లు ఇంటాబయటా మాస్క్​ లేకుండా ఉండొచ్చన్నారు. సంగీత కచేరిలు, స్పోర్ట్స్​ స్టేడియాలకు వెళ్లినప్పుడు మాత్రం కచ్చితంగా మాస్క్​ పెట్టుకోవాలని జనానికి సూచించారు.  వ్యాక్సిన్​ వేసుకుంటే కరోనా సోకే ముప్పు చాలా తక్కువ అని సీడీసీ డైరెక్టర్​ రోచెల్లీ వాలెన్​స్కీ అన్నారు . ఫిజికల్​ డిస్టెన్స్​ సాధ్యం కాని ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలని సిఫార్సు చేశారు.

Tagged america, corona, Joe Biden, Mask, vaccinated,

Latest Videos

Subscribe Now

More News