మీడియం రేంజ్​ మిసైల్ గురి తప్పలే!

మీడియం రేంజ్​ మిసైల్ గురి తప్పలే!

బాలేశ్వర్​: డీఆర్డీవో ఎక్కుపెట్టిన గురి తప్పలేదు. ఎంచుకున్న టార్గెట్​ మిస్​ అవ్వలేదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తయారు చేసిన మీడియం రేంజ్​ సర్ఫేస్​ టు ఎయిర్​ మిసైల్​(ఆకాశంలోని టార్గెట్లపైకి భూమ్మీది నుంచి ప్రయోగించే మధ్య శ్రేణి క్షిపణి) టెస్ట్​ సక్సెస్​ అయింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలేశ్వర్​లో ఉన్న ఇంటిగ్రేటెడ్​ టెస్ట్​ రేంజ్​(ఐటీఆర్​) నుంచి ఈ మిసైల్​ను డీఆర్డీవో టెస్ట్​ చేసింది. ఎక్కడో దూరంగా ఉన్న హైస్పీడ్​ టార్గెట్​ను మిసైల్​ తునాతునకలు చేసిందని సంస్థ ప్రకటించింది. ఇండియన్​ ఆర్మీ అమ్ములపొదిలో భాగమైన ఈ మిసైల్​.. అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో అందుకుందని తెలిపింది. 

70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలూ ఖల్లాస్​
ఈ మిసైల్​ సిస్టమ్​లో క్షిపణులతో పాటు.. కంబాట్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​(సీఎంఎస్​), మొబైల్​ లాంచర్​ సిస్టమ్స్, అడ్వాన్స్​డ్​ లాంగ్​రేంజ్​ రాడార్, రాడార్​ పవర్​ సిస్టమ్, మొబైల్​ పవర్​ సిస్టమ్, రీలోడర్​ వెహికల్, మిసైల్ ​సిస్టమ్​ను తీసుకెళ్లే ఫీల్డ్​సర్వీస్​ వెహికల్​ భాగంగా ఉంటాయి. ఈ మిసైల్​ సిస్టమ్​ మొత్తాన్ని ఒక ఫైరింగ్​ యూనిట్​గా పిలుస్తారు. ఇండియన్​ ఆర్మీ కోసం ఇజ్రాయెల్​ సంస్థ ఐఏఐతో కలిసి డీఆర్డీవో ఈ మిసైల్​ సిస్టమ్​ను తయారు చేసింది. రాకెట్​ మోటార్​, కంట్రోల్​ సిస్టమ్స్​ను డీఆర్డీవోనే సొంతంగా రూపొందించింది. శత్రు దేశాల నుంచి వచ్చే యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, గైడెడ్​, అన్​గైడెడ్​ మిసైళ్లు, సబ్​సోనిక్, సూపర్​సోనిక్​ మిసైళ్లను నాశనంచేసే సత్తా ఈ మిసైల్​ సొంతం. 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అల్కగా నాశనం చేయగలుగుతుంది. ఇండియన్​ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు కూడా టెస్టింగ్​ను దగ్గరుండి పరిశీలించారు. మిషన్​ ఆబ్జెక్టివ్స్​ మొత్తాన్ని రికార్డు చేశారు.