రాబోయే 3 రోజులు వర్ష సూచన

రాబోయే 3 రోజులు వర్ష సూచన

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒరిస్సా తీరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం..శనివారం వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా - పశ్చిమ బెంగాల్  వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న  ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి  ఉంది. వీటి ప్రభావంతో రానెన్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  ఆదివారం, సోమవారం రాష్ట్రంలో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్క డక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.