ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలుల్లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 44.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 

మరిన్ని వార్తల కోసం..

ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం

అంబులెన్స్​ టైంకు వస్తలే