పీసీలో మొబైల్ వాడొచ్చు

పీసీలో మొబైల్ వాడొచ్చు

కంప్యూటర్ లేదా ల్యాప్‌‌టాప్‌‌పై పనిచేసేటప్పుడు మాటిమాటికీ మొబైల్ ఓపెన్​ చేసే పనిలేకుండా మొబైల్ స్క్రీన్‌‌ను కంప్యూటర్ స్క్రీన్‌‌పై కనిపించేలా చేయొచ్చు. అదెలాగంటే.. 
బ్రౌజర్ ఓపెన్ చేసి ‘ఎస్‌‌సీఆర్‌‌సీపీవై డౌన్‌‌లోడ్’ అని టైప్ చేస్తే ‘గిట్ హబ్’ అనే వెబ్‌‌సైట్ కనిపిస్తుంది. అందులో ఓఎస్‌‌ వెర్షన్‌‌ బట్టి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్‌‌వేర్ ఇన్‌‌స్టాల్ చేశాక మొబైల్‌‌లో ‘ఎయిర్ డ్రాయిడ్’ అనే యాప్ ఇన్‌‌స్టాల్ చేయాలి.   మొబైల్‌‌లోని ఎయిర్ డ్రాయిడ్ యాప్‌‌లో ‘మీ’ సెక్షన్ లో ‘సెక్యూరిటీ అండ్‌‌ రిమోట్‌‌ ఫీచర్స్‌‌’లోకి వెళ్లాలి. ‘స్క్రీన్‌‌ మిర్రరింగ్‌‌’ ఫీచర్‌‌ ఎనేబుల్‌‌ చేసుకోవాలి. 

యూఎస్‌‌బీ కేబుల్‌‌తో ఫోన్‌‌, పీసీని కనెక్ట్‌‌ చేయాలి.  ఫోన్‌‌లో యూఎస్‌‌బీ డీబగింగ్‌‌ మోడ్‌‌ ఎనేబుల్‌‌ చేసి ఉండాలి.  తర్వాత పీసీలో ‘ఎస్‌‌సీఆర్‌‌సీపీవై’ యాప్‌‌ రన్‌‌ చేయాలి. దీంతో పీసీ మీద ఫోన్‌‌ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది. కంప్యూటర్ మౌస్‌‌తోనే ఫోన్‌‌ ఆపరేట్ చేయొచ్చు. ల్యాప్‌‌టాప్‌‌ లేదా కంప్యూటర్‌‌‌‌లో ‘ఎయిర్‌‌డ్రాయిడ్‌‌ వెబ్‌‌’ వాడి మొబైల్‌‌ను వైర్‌‌‌‌లెస్‌‌గా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇందులో ఫైల్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌, కాంటాక్ట్‌‌ కాపీ, రిమోట్‌‌ టెక్స్ట్​, బ్యాకప్స్‌‌ వంటి ఫీచర్లు  ఉంటాయి.