కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు షురూ..గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు షురూ..గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు స్పీడప్ అయ్యాయి. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది కేంద్రం. ఫస్ట్ హెల్త్ వర్కర్లకు, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. మూడో రౌండ్ లో 50 ఏండ్లు దాటిన, ఇతర జబ్బులున్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు. ముందస్తుగా రిజిస్ర్టేషన్  చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. నేరుగా సెంటర్ల దగ్గరకు వచ్చిన వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది కేంద్రం.

  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు షురూ అయ్యాయి. పోలింగ్ సెంటర్ల లాగానే  వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన గైడ్ లైన్స్ జారీ చేసింది. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్ల కు, మూడో రౌండ్లో 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. వీరు దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్ని కల ఓటర్ కార్డుల్లోని వివరాలఆధారంగా 50 ఏండ్లు దాటిన వారిని గుర్తించి, వివరాలను సేకరించాలని తెలిపింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్ సాఫ్ట్ వేర్ లో  సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కు   అవకాశం ఇవ్వనున్నారు.

రిజిస్ర్టేషన్ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెబ్ సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ముందస్తుగా రిజిస్ర్టేషన్  చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల దగ్గరకు వచ్చినవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే కొవిన్ వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పింది. వాళ్లకు ట్రీట్మెంట్ అందించేందుకు డాక్టర్ లు, మెడికల్ టీమ్లను సిద్ధంగా ఉంచాలని వివరించింది.

ఉదయం 9నుంచి సాయంత్రం 5 వరకూ వ్యాక్సి న్లు వేయాలని కేంద్రం సూచించింది. హెల్త్ స్టాఫ్ కు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, దవాఖాన్లలోనే వ్యాక్సి న్ వేయాలని తెలిపింది. వీరి డేటాను ఇప్పటికే ఆరోగ్యశాఖ సేకరించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను ఆయా శాఖల నుంచి సేకరించి, ఆరోగ్య సిబ్బంది రిజిస్ర్టేషన్ చేయనున్నారు.