
నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో ఎమ్.ఎస్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన టీమ్, బుధవారం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మే 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకుంది. గత కొంతకాలంగా నరేష్ రియల్ లైఫ్‌లో జరుగుతున్న ఇన్సిడెంట్స్‌నే ఇందులో చర్చించబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌లో చూపించారు. వనిత విజయ్ కుమార్, జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి సంగీతం అందించారు.