వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్టులో షారుఖ్

వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్టులో షారుఖ్

వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్టులో షారుఖ్ ఖాన్ ఫోర్త్ ప్లేస్ లో నిలిచారు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన ప్రపంచంలోని 8 మంది సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు స్థానం దక్కింది. ఈ లిస్టు ప్రకారం షారుఖ్ ఆస్తుల నికర విలువ 770 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.60వేల కోట్లకు పైమాటే. ఆస్తుల విలువలో షారుక్‌ పలువురు హాలీవుడ్‌ హీరోలను కూడా వెనక్కు నెట్టేశారు. టామ్‌ క్రూయిజ్, జాకీచాన్‌ తదతర దిగ్గజ హాలీవుడ్‌ నటుల కన్నా షారుఖ్ ముందు వరుసలో ఉన్నారు. ఇక ప్రముఖ హాలీవుడ్‌ కమెడియన్‌ జెర్రీ సైన్‌ఫీల్డ్‌ 1 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచాడు.టామ్ క్రూజ్ 620 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉన్నాడు. జాకీ చాన్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నీరో కూడా ఈ లిస్టులో ఉన్నారు. రిచెస్ట్ యాక్టర్స్ లిస్టులో ఇండియా నుండి చోటు సంపాదించుకున్న నటులలో షారుఖ్‌ఖాన్ మాత్రమే ఉండ‌టం విశేషం.